Diverse matters

 Diverse matters


ఏ భార్యాభర్తలైన విడిపోవాలనుకుంటే పెళ్లయిన వెంటనే వాళ్లకు పడదు అనిపిస్తే అప్పుడే విడిపోవాలి.


 కేవలం పిల్లలు పుట్టాక విడిపోకూడదు.

 విడి పోవాలి అని ఆలోచన వచ్చాక పిల్లల్ని కనకూడదు.


ఎవరికోసమో మీరు పిల్లల్ని కనకూడదు.

ఎందుకంటే వాళ్ళు ఎవ్వరూ మీ పిల్లల్ని చూడరు.


మీ పిల్లల్ని మీరు మాత్రమే చూడాలి మీ పిల్లలు బాధ్యత మీకు మాత్రమే ఉంటుంది.


పిల్లలు లేరని వందమంది వంద రకాలుగా అనొచ్చు


 కానీ నీ పిల్లలకు కష్టం వస్తే వాళ్ళు ఎవ్వరూ రారు

నీ కష్టం వచ్చినా వాళ్ళు ఎవరూ రారు.


 అప్పుడు నీ బాధ నీ పిల్లల బాధ నువ్వు ఒక్కరే భరించాలి.


డబ్బు లేకపోతే ఎవరూ రారు కొన్నిసార్లు డబ్బున్న కూడా ఎవరూ రారు.


భార్యకు భర్త కావాలంటే దొరుకుతారు భర్తకు భార్య కావాలంటే దొరుకుతుంది


 కానీ పిల్లలకు తల్లిదండ్రులు కావాలి అంటే కన్నవాళ్ళు మాత్రమే కావాలి


 పరాయి వాళ్లు తల్లిదండ్రులు అవ్వరు.

ఎవరైనా ఆడదాని తల్లిని చేయగలరు కానీ అదే ఆడదానికి తండ్రి అవ్వలేడు.


మనకోసం మనకు సంబంధం లేని బంధం కోసం ఈ లోకంలోకి కొత్త బంధాన్ని తీసుకొచ్చి ఎందుకు బాధ పెట్టాలి


 కేవలం కాసేపు శారీరక సంబంధం కోసం ఒక జీవితానికి బలి చేసే హక్కు మనకు ఎవరిచ్చారు



Comments

Popular posts from this blog

Life at 45+